దూడయ్య సేవలు చిరస్మరణీయం: చీకటి వెంకట్రాం నరసయ్య
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి, పదవీ విరమణ అనంతరం గౌడ సంఘ నాయకుడిగా సమాజాభివృద్ధికి విశేష కృషి చేసిన దూడయ్య సేవలు అభినందనీయమని గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకటి వెంకట్రాం నరసయ్య అన్నారు. దూడయ్య స్మారక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, కేసముద్రం స్టేషన్ పట్టణ స్థాయిలో గౌడ సంక్షేమ సంఘాల ఏర్పాటుకు దూడయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. గౌడ కుల బాంధవులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, గౌతు లచ్చన్న, గండు ఐలయ్య, మాచర్ల జగన్నాథం వంటి ప్రముఖ గౌడ నాయకులను ఆదర్శంగా తీసుకుని దూడయ్య సమాజ సేవలో ముందుకు సాగారని పేర్కొన్నారు. అనేక అడ్డంకులు ఎదురైనా కేసముద్రం మండలంలో గౌడ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు గౌడ బాంధవుల కోసం మండల స్థాయిలో భారీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా కేసముద్రం పట్టణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దూడయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మోడల్ రవీందర్ గౌడ్, గునగంటి అశోక్ గౌడ్, ముఖ్య సలహాదారు చీకటి వేలాద్రి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.