తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో "మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జూలై 20న ఉదయం 10:30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మల్లిఖార్జున ఫంక్షన్ హాలులో నిర్వహించబడుతుందని, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే కేంద్రాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రయత్నాలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టుల భర్తీ, తగిన తరగతి గదులు, బెంచీలు, స్వచ్ఛమైన తాగునీరు, ప్రత్యేక మరుగుదొడ్లు, డిజిటల్ బోధన సౌకర్యాలు, ఇంటర్నెట్, ప్రహరీ గోడ, భద్రతా ఏర్పాట్లు, ఆటస్థలం, పరిశుభ్రమైన వంటగది, పచ్చదనం వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ క్రాంతి దళ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాఠశాలలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు డా.సంగం రెడ్డి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని రామన్నపేట మండల కమిటీ తెలిపింది.