బోనాల జాతరకు సిద్ధమవుతున్న చెంగిచెర్ల
విశ్వంభర, చెంగిచెర్ల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బోనాల పండుగకు చెంగిచెర్ల గ్రామం సిద్ధమవుతోంది. శ్రావణమాసం ప్రారంభంలో భాగంగా ఆగస్టు 16న జరిగే బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల గ్రామ పెద్దలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామ పెద్దలు, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో సమావేశం నిర్వహించి బోనాల వేడుకలను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. గ్రామ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరస్పర సహకారంతో వేడుకలను విజయవంతం చేయాలని సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొత్త చెందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొత్త రవి గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రంగ బ్రాహ్మణ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, కొత్త శ్రీశైలం గౌడ్, కొత్త గోపాల్ గౌడ్, కొత్త విక్రమ్ గౌడ్, కుర్రి మహేష్‌తో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని బోనాల జాతర ఏర్పాట్లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.