‘స్కై బ్లూ జీన్స్’ పుస్తకం ఆవిష్కరణ
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రేమ వివాహాలు వ్యక్తిగత విషయం మాత్రమే కాకుండా కుల వ్యవస్థ, మతం, ఆస్తి సంబంధాలు, రాజకీయాలతో ముడిపడిన సామాజిక అంశమని సిటీ కళాశాల ప్రొఫెసర్ కోయి కోటీశ్వరరావు అన్నారు. సి.ఎస్. సాగర్ రచించిన ‘స్కై బ్లూ జీన్స్ (నేటి వివాహ రాజకీయాలు)’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానస ఎండ్లూరి మాట్లాడుతూ కులాంతర ప్రేమ వివాహాలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సామాజిక ఉద్యమాలు అవసరమన్నారు. లెల్లే సురేష్ మాట్లాడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించి, వాటిపై జరిగే దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్టిపాటి వెంకటేశ్వర్లు, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు