కాచిగూడలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

విశ్వంభర, కాచిగూడ: హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 18న నిర్వహించిన దాడిలో సారా శివేష్ అలియాస్ బన్నీ, వడ్లూరి ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ధూల్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి తెచ్చుకుని విక్రయిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన సరఫరాదారు పరారీలో ఉండగా, అతడిని పట్టుకు నేందుకు గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయి. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/ganja-selling-gang-arrested-in-kachiguda/article-19037

Tags: