శ్రీ సంతోషి మాత దేవాలయంలో వారాహి మాత పూజలు
విశ్వంభర, సూర్యాపేట: ఆషాఢ మాసా న్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోష మాత దేవాలయంలో ఆదివారం వారాహి నవరాత్రి ఉత్సవాల లో భాగం గా 5 వ రోజు అశ్వారూఢ వారాహి గా శ్రీ వారాహి మాత పూజలు అందుకున్నది. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వారాహి మాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. వారాహిమత గొప్పదనాన్ని భక్తుల వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా శ్రీ చక్ర కుంకుమార్చన, కనకాంబరం లతో అర్చనను నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్ రావు కోశాధికారి కొత్త మల్లికార్జున్ ఉపాధ్యక్షులు బెలిదే అశోక్, దేవర్శెట్టి సోమయ్య , వందనపు వెంకటేశ్వర్లు దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం భక్తులు గజ్జి నవీన్, నీలిమ,తాళ్లపల్లి సత్యనారాయణ నంద్యాల స్వాతి, వరలక్ష్మి, నాగమణి,నీరజ, జగన్,శ్రీదేవి , విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.