వెల్లంకిలో మంచినీటి బోరు మోటర్ ప్రారంభం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని 4వ వార్డులో మాధవ రెడ్డి విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్ ను ఆదివారం గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు మెంబర్ సండ్ల లింగయ్య, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 4వ వార్డు ప్రజలకు తాగునీటి ఇబ్బంది తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ బోరు మోటర్ ను ఏర్పాటు చేశామని సర్పంచ్ తెలిపారు. ఇకపై వార్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సకాలంలో మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్ కు, వార్డు మెంబర్ కు 4వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.