బండకొత్తపల్లికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్

బండకొత్తపల్లికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్

  • ఏళ్ల తరబడి నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం

విశ్వంభర, బండకొత్తపల్లి: ఎన్నో సంవత్సరాలుగా బండకొత్తపల్లి, వస్తాకొండూరు గ్రామాలకు ఒకే విద్యుత్ ఫీడర్ ఉండటంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. బండకొత్తపల్లి గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్ ఏర్పాటు చేయడంతో గ్రామానికి స్వతంత్రంగా విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, అలాగే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి సానుకూల స్పందనతో బండకొత్తపల్లి గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్ మంజూరై అమల్లోకి రావడంతో ఇకపై విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యేకు, విద్యుత్ శాఖ ఏఈ నర్సింహులు, లైన్‌మెన్‌లు సోమయ్య, శేఖర్‌లకు సర్పంచ్ గద్వాల ఉపేందర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ గద్వాల ఉపేందర్ పేర్కొన్నారు. ప్రత్యేక విద్యుత్ ఫీడర్ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందడంతో పాటు వ్యవసాయ, గృహ అవసరాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుందని ఆయన తెలిపారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/separate-power-feeder-for-bandakottapalli/article-19004

Tags: