మహేశ్వరం ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ పెద్దలు, యువకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ కమిటీ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. సంఘం అభివృద్ధి కోసం మాజీ కమిటీ సభ్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని సంఘ పెద్దలు పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీకి బాధ్యతలను అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కమిటీ సభ్యుల అనుభవాలు, సలహాలను తీసుకుంటూ సంఘ బలోపేతంతో పాటు ముదిరాజ్ కులబాంధవుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సభ్యుడిని కలుపుకొని ముందుకు సాగుతూ పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహం ఏర్పాటు, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. అలాగే నిరుపేద కులబాంధవుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా కర్రోల చంద్రయ్య, గౌరవ అధ్యక్షులుగా కాకి ఈశ్వర్, కావాలి జంగయ్య, గద్దగూటి ఎట్టయ్య, ఉపాధ్యక్షులుగా కాకి పరమేష్, కురమిద్ద లింగామయ్య, కాకి మల్లేష్, సుంచు సురేష్, ప్రధాన కార్యదర్శిగా కటికల ధనంజయ్, ఉప కార్యదర్శిగా కాకి రాజేష్ కుమార్, కోశాధికారిగా మొలగాసి మహేష్, ప్రచార కార్యదర్శిగా పల్లెమోని అశోక్, యూత్ అధ్యక్షుడిగా గద్దగూటి యాదయ్య, యూత్ ఉపాధ్యక్షులుగా మొలగాసి రవి, నడికుడ రాకేష్, సుంచు శివకుమార్తో పాటు సలహాదారులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు, పెద్దలు, యువకులు, కులబాంధవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/maheshwaram-mudiraj-sangam-new-committee-unanimously-elected/article-19041

Tags: