ఎల్‌నినో ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్ధం
- ఉపాధి, జల సంరక్షణపై ప్రత్యేక కార్యాచరణ
విశ్వంభర, హైదరాబాదు : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు జల సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుంది. ఆదివారం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి దశలో జూలై నుంచి అక్టోబర్ వరకు 4.5 కోట్ల పనిదినాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం రోజుకు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా, దానిని 5 లక్షలకు పెంచేలా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు, 25 వేల పంట కుంటలు, 5 వేల ఊట కుంటలు, 5 వేల బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే వనమహోత్సవం, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నారు. తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రతతో పాటు ఉపాధి భద్రత కల్పించడమే ఈ కార్యాచరణ ప్రధాన లక్ష్యమని శాఖ పేర్కొంది.