ఘనంగా ముగిసిన యోనెక్స్–సన్‌రైజ్ అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026
- డబుల్ క్రౌన్ సాధించిన చిన్‌మయ్ వాంకెడే, షాన్వి రెడ్డి నిమ్మ
విశ్వంభర, బషీర్‌బాగ్: రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) అనుమతితో నిర్వహించిన యోనెక్స్–సన్‌రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్ (అండర్-15) బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 ఆదివారం మణికొండలోని మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ స్టేడియంలో ఘనంగా ముగిసింది. మూడు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పాల్గొన్న యువ షట్లర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చిన్‌మయ్ వాంకెడే రెండు టైటిళ్లు కైవసం చేసుకుని డబుల్ క్రౌన్ సాధించగా, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో షాన్వి రెడ్డి నిమ్మ రెండు స్వర్ణ పతకాలు గెలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టోర్నమెంట్ రెండో రోజు భారత ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్టేడియాన్ని సందర్శించి పోటీలను వీక్షించారు. యువ క్రీడాకారుల ఆటతీరును అభినందిస్తూ మరింత కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారికి సూచించారు. ఆయన రాకతో క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రుల్లో ఉత్సాహం నెలకొంది. ముగింపు కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి.యు. భాస్కర్ బాబు, పి. రమేష్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం సలహాదారు కె. లక్ష్మణ్, బ్యాట్ కోశాధికారి కె. వంశీధర్, సంయుక్త కార్యదర్శి (ఈవెంట్స్ అండ్ ప్లేయర్స్) యూవీఎన్ బాబు, ప్రముఖ కోచ్ జేబీఎస్ విద్యాధర్, మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు, చైర్మన్ ముప్పాల వేణు, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కారెడ్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం ద్వారా యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందుతాయని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు, చైర్మన్ ముప్పాల వేణు మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనడం వల్ల పిల్లల్లో ఆటపై నైపుణ్యం, మానసిక ధైర్యం, పోటీతత్వం పెరుగుతాయని అన్నారు. ఇలాంటి పోటీలు భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లను నిర్వహించి యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.