కబేళాను పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మందల కేంద్రంలోని సిపిఎం పట్టణ కమిటీ ఆద్వర్యంలో బాబుచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు కందుల హనుమంతు, సిపిఎం పట్టణ కార్యదర్శి మునుకుట్ల లెనిన్ మాట్లాడుతూ, గ్రామంలో మేకలను, గొర్రెలను ఎవరి ఇంటి ముందు వారు కోయడం ద్వారా జీవ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన దుర్గంధం వెదజల్లుతూ ఉన్నందున, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మేకల, గొర్రెల మాంసాన్ని ఒకే చోట కోసేందుకు కబేళా ను పునరుద్ధరించేందుకు మాంసం మార్కెట్ ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఒకే చోట కోయడం ద్వారా గ్రామ పంచాయితీ ముద్ర వేసిన మేకలు, గొర్ల మాంసాన్ని విక్రయించాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, సీనియర్ నాయకులు ఆముద ఆంజనేయులు, పల్లె సత్యం, నకిరేకంటి సురేష్ బాబు చారి, పల్లె లింగస్వామి, అప్పం సంతోష్, బోల్ల వెంకన్న, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.