తీజ్ పండుగ దేశమంతా ఒకేసారి జరిగేలా చూడాలి 

విశ్వంభర, బషీర్ బాగ్: గోర్ బంజారాల తీజ్ పండుగ ఆగస్టు 18 నుంచి 27 వరకు దేశమంతా ఒకేసారి జరిగేలా చూడాలని గోర్ సిక్వాడి సామాజిక ఉద్యమ ప్రతినిధులు అటమీ నాయక్ పురుషోత్తం, లావుటియా అంబర్ సింగ్ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  ఆదివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ గోర్సేన భారత్ ఉపాధ్యక్షులు డాక్టర్ రవీందర్ తో కలిసి వారు మాట్లాడారు.  ఇతర మతస్తుల పండుగల తరహాలోనే తీజ్ పండుగ నిర్వహణకు ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సింధు నగరికత ముందే నుంచే తీజ్ పండుగను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. తీజ్ పండుగలో భాగంగా మహిళలు, చిన్నారులు ఒక చోటుకు చేరి ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారని పేర్కొన్నారు. చివరి రోజు  ఆడపడుచులు తీజ్ దగ్గరకు గోర్ సంస్కృతి, సాంప్రదాయం వేషాధారణ లో పాల్గొంటారన్నారు. తీజ్ పండగను బాధ్యతగా ఉత్సాహంగా నిర్వహించిన పెద్దవాళ్లకు ప్రత్యేక బహుమతులు ఇస్తారని వివరించారు. సమావేశంలో బోర్ బంజారాల ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-should-be-seen-that-teej-festival-is-held-simultaneously/article-19002

Tags: