శ్రీ చైతన్యలో ‘హరితో దయ’ కార్యక్రమం
- మొక్కలు నాటి.. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల ప్రతిజ్ఞ
విశ్వంభర, కళ్యాణదుర్గం: అనంతపురం జోన్ ఏజీఎం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఆదివారం ‘హరితో దయ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఫిలిప్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న నాగరికత, మానవ అవసరాల కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు అంతరించిపోతే వర్షపాతం తగ్గి భవిష్యత్తులో భూమి ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. "చెట్లను రక్షిస్తే.. చెట్లు మనల్ని రక్షిస్తాయి" అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుంచి టీ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. "ఇదిగో పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు", "సేవ్ ద ట్రీ", "సేవ్ ద వాటర్" వంటి నినాదాలతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు. తదుపరి పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పీఈటీలు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిలిప్ కుమార్, డీన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రైమరీ ఇన్‌చార్జ్ లీలావతి, ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జ్ హేమలత, పీఈటీలు అశోక్, హరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.