అందె శ్రీ రేవంత్ రెడ్డికి ఆత్మబంధువు ఎలా అవుతారో చెప్పాలి
- : బి ఆర్ఎస్ నాయకులు
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో బీఆర్ఎస్ నాయకులు ఘట్కేసర్ శివారెడ్డి గూడా బందన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ , అందెశ్రీ సభను రాజకీయ వేదికగా మార్చడం సరికాదని విమర్శించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించాలని కోరారు. అంద శ్రీ నీకు ఆత్మబంధువు ఎలా అవుతాడని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమంలో అంద శ్రీ పాటలు పాడుతూ తిరుగుతే నువ్వు గన్నులు పట్టుకుని తిరిగావు నీకు అంద శ్రీ ఆత్మబంధు ఇలా అవుతారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.