బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి : పింగళి విజయభాస్కర్ రెడ్డి
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలోని అంబాల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పింగళి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రానున్న పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. బూత్ అధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబాల గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు వెంపటి సురేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఆవుల సాయి తేజ, టీ. కిషోర్ గౌడ్, జి. మల్లేష్, పి. రామ నరసయ్య, మజ్జిగ రామ, నరముల కిష్టయ్య, బద్దం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.