హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రతి ఓటరుకు సహాయం అందాలి: కాలేరు వెంకటేష్

విశ్వంభర, అంబర్‌పేట : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వివరాలను నమోదు చేసుకునేలా అధికారులు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే అడ్వకేట్ కాలేరు వెంకటేష్ అన్నారు. హైదరాబాదు అంబర్‌పేట నియోజకవర్గంలోని శంకర్‌నగర్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి ఎస్‌ఐఆర్ ఫారాలను సక్రమంగా నింపే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఫారాల నింపుదల కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, ప్రజలు తమ వివరాలను సరిగా నమోదు చేసుకునేలా సూచనలు చేశారు. అధికారులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి సహాయం అందించాలని సూచించారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-voter-should-get-help-through-helpdesk-kaleru-venkatesh/article-19035

Tags: