కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేస్తా: తుంగతుర్తి రవి
- పార్టీపై కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక
విశ్వంభర, మేడిపల్లి: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మేడిపల్లి 9వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ ప్రధాన కార్యదర్శి జలేందర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను అధిష్ఠానం గుర్తిస్తుందని అన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తుంగతుర్తి రవి మాట్లాడుతూ గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని, గత ప్రభుత్వ హయాంలో కేసులు, ఇబ్బందులు ఎదురైనా పార్టీని వీడలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు నాయకులు పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా కేవలం పదవుల కోసమే పనిచేయడం బాధాకరమన్నారు. పార్టీలో తన వల్ల ఏవైనా లోపాలు ఉంటే సూచించాలని, వాటిని సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీపై ఎలాంటి కుట్రలు జరిగినా సహించబోమని హెచ్చరించిన ఆయన, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు పూర్తి కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మేడిపల్లి డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ ఇన్‌చార్జులు, మాజీ కార్పొరేటర్ అభ్యర్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.