తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ

విశ్వంభర, హుస్నాబాద్: తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో ఆదివారం రోజున రోగులకు ,బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, సమాజానికి నిరంతరం సేవలందించే పాత్రికేయులు సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రోగులకు త్వరగా ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ వారికి పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాణహిత పత్రిక ఎడిటర్ కె. సత్యనారాయణ, నీ మేలుకొలుపు పత్రిక ఎడిటర్ బి. లింగమూర్తి, సిద్దిపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు వంగ రాజు, సీనియర్ జర్నలిస్టులు ఎస్. ఆంజనేయులు, వి. ప్రశాంత్, జి. శ్రీనివాస్, ఎం. మనోజ్, భరత్, శంకర్, హాస్పిటల్ ఇంచార్జ్ రమేష్ రెడ్డి, డ్యూటీ డాక్టర్ శివ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-fruits-and-breads-to-patients-under-the-aegis/article-19055

Tags: