వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, సికింద్రాబాదు : ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాదు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నట్లు చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా సకాలంలో మంచి వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో మంచి వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని పూజారులు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. మంచి వర్షాలు కురిస్తే రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.