రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం.. జీవో 114 రద్దు చేయాలి: ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, విద్యానగర్ : జీవో 114 వల్ల రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే దానిని రద్దు చేసి జీవో 550 ప్రకారం పాత విధానంలోనే మెడికల్ సీట్ల కేటాయింపులు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిష్కారం లభించలేదని అన్నారు. జీవో 114 అమలుతో రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి జీవో 550 ప్రకారం పాత విధానంలోనే సీట్ల కేటాయింపులు చేపట్టాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఓపెన్ కేటగిరీలో మెరిట్ సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో పరిగణించకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయాలు వాటిని పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. ఓపెన్ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి కళాశాల ఆప్షన్ మార్చుకుంటే ఆ సీటును అదే రిజర్వేషన్ వర్గానికి చెందిన మరో అర్హ అభ్యర్థికే కేటాయించాలని జీవో 550లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, అందుకు విరుద్ధంగా సీట్ల కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.