పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియం–2023) ను డీలిమిటేషన్, జనగణనతో సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళా సంఘాల ప్రతినిధులు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సీపీఐ నాయకుడు కె. రామలకు వినతిపత్రాలు అందజేశారు. దేశ జనాభాలో మహిళలు సగం ఉన్నప్పటికీ శాసనసభలు, పార్లమెంట్‌లో వారికి తగిన ప్రాతినిధ్యం లేదని మహిళా సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ 106వ సవరణకు అవసరమైన మార్పులు చేసి, మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కె.ఎన్. ఆశాలత, పి. శశికళ తదితరులు పాల్గొన్నారు.