వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి రూ.30 వేల ఆర్థిక సహాయం

విశ్వంభర, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పేద విద్యార్థిని సాయి లక్ష్మికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు సంబు శ్రీనివాసులు, సంబు పాండు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జోన్ చైర్మన్ అర్థం సాయి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్‌మీడియట్ చదువుతున్న సాయి లక్ష్మికి జోన్ చైర్మన్ అర్థం సాయి కృష్ణ రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి సామాజిక సేవా కార్యక్రమానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు కుట్ర బాలాజీ, అక్కుతోట మధుమోహన్, చిగుళ్లపల్లి రమణ, పాస రాఘవేందర్, చెరుకు యాదయ్య, ఇరువేటి స్వామి, కందూరు లక్ష్మణస్వామి, సేవా ప్రమోద్ కుమార్, బీసన్ రాఘవేంద్ర, రఘు, వాస లక్ష్మి, కందూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-30-thousand-to-a-poor-student/article-19065

Tags: