కేవీఆర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
విశ్వంభర, ఎల్‌బీ నగర్: బైరామల్‌గూడలో నివాసముంటున్న జర్నలిస్టు కే. వెంకట్ రామ్ రెడ్డి (కేవీఆర్)ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రామ్ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బింగి భరత్ గౌడ్, సూర్వి యాదయ్య గౌడ్, యాదగిరి, తుప్పటి శ్రీకాంత్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.