ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: వి. హనుమంతరావు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రజలు ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవడంతో పాటు, సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రభుత్వ సలహాదారు, హనుమంతరావు అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంగెళ్ల మూడి నందగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. శిబిరంలో సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పలువురికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ,, ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ శ్రీమన్నారాయణ, అక్షర జ్యోతి ఉమెన్ అండ్ చైల్డ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అనూష, కోల జనార్దన్, ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రజాసంబంధాల ప్రతినిధి శ్రీలత, ఉదయ్ నేత, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మేటు వేణు, ఆర్. లక్ష్మణ్ యాదవ్, టీ. కృష్ణ గౌడ్, సందీప్, మీనాక్షి, సుచిత్ర, డాక్టర్ సి.ఎం. రావు,, సుందరయ్య పార్క్ వాకర్స్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, వెంకటస్వామి గౌడ్,   నాగభూషణం, రాజు  తదితరులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/v-hanumantha-rao-should-maintain-health-by-undergoing-health-tests/article-19087

Tags: