అయ్యప్ప సన్నిధిలో విత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. - విత్రీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. 

అయ్యప్ప సన్నిధిలో విత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. -  విత్రీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. 

విశ్వంభర, చండూర్ :- విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక లకు సంబందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను  స్థానిక శ్రీ హరిహర అయ్యప్ప స్వామి  దేవస్థానంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణలో ప్రముఖ విద్యావేత్త , సామాజికవేత్త , ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షులు , గాంధీజీ విద్య సంస్థల చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు సమక్షములో మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వార్త సమాచారాన్ని ప్రజలకు ఉన్నదిఉన్నట్టుగా అందిస్తూ కొద్దీ కాలంలోనే విస్తృత ప్రాచుర్యం పొందిన విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రికకు వారి యాజమాన్యానికి , సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్న విత్రీ ఛానల్ , విశ్వంభర పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలో మరింతగా ప్రజల సమస్యలను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కు తెలియజేసి పరిష్కార దిశగా పని చేయాలనీ అన్నారు. అలాగే మీడియా యాజమాన్యానికి , సిబ్బందికి, పాఠకులకు నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త , సామజిక సేవకులు సముద్రాల వెంకటేశ్వర్లు గుప్త మాట్లాడుతూ విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక ల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో సమస్యల ను వెలికితీసి పరిష్కారం దిశగా అడుగులు వేసి , భాదిత , పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా విత్రీ న్యూస్ పాత్ర మరింతగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సీనియర్ కరెస్పాండెంట్ ఏలే మహేష్ పద్మశాలి,  అయ్యప్పస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ చిరువెళ్లి ప్రవీణ్ శర్మ , మాజీ వార్డ్ మెంబర్ ఐతరాజు మల్లేష్ , వనం నిఖిల్ , వర్కాల వెంకటేష్ , చెరుపల్లి శివ , శ్రీను , తదితరులు పాల్గొన్నారు.  
 
 

Tags: