గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత మాది
- తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
విశ్వంభర, హనుమకొండ: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి కోసం అదనంగా 10 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి ఆయన రోడ్డు షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. . ఇప్పటికే మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు డ్రైన్లు వేశం , మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పుర పోరులో గెలిపించి స్థానిక సమస్యలను పరిష్కారించుకుందామని అన్నారు. అరులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతమాదని , రెండవ విడత ఏప్రిల్ లో ప్రారంభం అవుతుందాని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా మూడు విడతలుగా అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
ప్రజలందరూ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచి హస్తం గుర్తు కు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసే బాధ్యత మాదని అన్నారు. ప్రజలందరికీ చెప్పేదే ఒకటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాని వాళ్లు ప్రతిపక్ష నాయకులు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్తారు అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా ప్రజలను కోరారు...
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్య మని అన్నారు. ఐనవోలు, పర్వతగిరి, హాసన్పర్తి కేంద్రాలలో గెస్ట్ హౌస్‌లు లేవని, అలాంటి భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇళ్లు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకువచ్చానని, సొంత భవనాలు నిర్మించుకోవడం లేదా భూములు కబ్జా చేయడం తన అలవాటు కాదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మొత్తం 294 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోనే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సబ్ జైల్, మునిఫ్ కోర్టు, మినీ స్టేడియం వంటి కీలక నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి , కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్, 12వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



