స్కూల్ టీచర్ కోసం జిల్లా కలెక్టర్ ని కలిసిన యువకులు

రెండు నెలలుగా సైన్స్ టీచర్ లేక ఇబ్బంది విద్యార్థులు

స్కూల్ టీచర్ కోసం జిల్లా కలెక్టర్ ని కలిసిన యువకులు

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం తుమ్మలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 2 నెలల నుండి సైన్స్ టీచర్ లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పదవతరగతి విద్యార్థులకి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో వారు భయందోళనకి గురౌతున్నారు. ఈ సమస్య గురించి గ్రామ యువకులు, విద్యార్థుల తల్లితండ్రులు గత కొన్ని రోజులుగా ఎం ఈ ఓ. డిఈఓ కి ఏన్ని సార్లు విన్నవించిన ఉపయోగం లేకపోవడంతో  డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని కలవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గతంలో స్వయంగా ఒక టీచర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే స్కూల్ విద్యార్థుల ఇబ్బందిని అర్థం చేసుకొని రేపటి నుండి తుమ్మలూరు స్కూల్ కి సైన్స్ టీచర్ ని పంపించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు కటికేల యాదగిరి, కళ్యాణ్ రెడ్డి, కార్తీక్, ఇతర గ్రామ యువకులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Tags: