సీబీఎస్ఈ ఫలితాల్లో సెయింట్ పీటర్స్ విద్యార్థుల ప్రభంజనం.. ప్రిన్సిపాల్ మత్యాస్ రెడ్డి వెల్లడి

సీబీఎస్ఈ ఫలితాల్లో సెయింట్ పీటర్స్ విద్యార్థుల ప్రభంజనం.. ప్రిన్సిపాల్ మత్యాస్ రెడ్డి వెల్లడి

విశ్వంభర హనుమకొండ జిల్లా +-సీబీఎస్ఈ బోర్డు ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నూటికి నూరు శాతం ఉత్తిర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గోపు మత్యాస్ రెడ్డి,డైరెక్టర్ సునీతా రెడ్డి తెలిపారు.తెలుగు,ఇంగ్లీషు,ఏఐ,సైన్స్,సాంఘీక శాస్త్రంలో 100/100 మార్కులను పొంది పాఠశాలకు వన్నె తెచ్చారన్నారు. ఆఫ్రోజుద్దీన్ 486 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో,ఉదయ్ పాల్ రెడ్డి 481 మార్కులతో ద్వితీయ స్థానం,విద్యాన్షి 460,స్త్రీతికా రెడ్డి 456,కృష్ణా 455 మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

Tags: