80 టైల్స్‌ను 3 నిమిషాల్లో పగలగొట్టి ప్రపంచ రికార్డు
విశ్వంభర, నారాయణగూడ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జి.వి.ఆర్. కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్-80’ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ వి. సుధాకర్ ప్రపంచ రికార్డు సాధించారు. హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 80 షాబాద్ టైల్స్‌ను 9 కరాటే పద్ధతులతో కేవలం 3 నిమిషాల 6 సెకన్లలో పగలగొట్టి రికార్డు నెలకొల్పారు. ఈ ప్రదర్శనకు నిర్ణీత సమయం 8 నిమిషాలు కాగా, సుధాకర్ అంతకంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంస్థ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ పరిశీలించి, రికార్డు నమోదైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. కరాటే వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో జి.వి.ఆర్. కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్‌రెడ్డి, రామన్‌గౌడ్, కరాటే క్రీడాకారులు, కోచ్‌లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.