అంబర్‌పేటలో ఘనంగా బోనాల వేడుకలు
విశ్వంభర, అంబర్‌పేట : హైదరాబాదు అంబర్‌పేటలోని డీసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. జైహింద్ ఆధ్వర్యంలో భక్తులకు స్వాగతం పలికి, దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రామ్మోహన్, రామకృష్ణారెడ్డి, రజిత, లీల, వల్లి, మంజుల, సత్య, పవిత్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.