వ్యాంగుడిపై దాడి ఆరోపణలు.. ఇద్దరిపై కేసు
విశ్వంభర, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన కాశవేణి రాకేష్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇద్దరిపై చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉల్లంపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల వెంకటస్వామి, నర్సింగోజు విజయ్‌లపై కేసు నమోదైంది. ఫిర్యాదు మేరకు.. ఈ నెల 7న ఉదయం రాకేష్ ఇంట్లోకి ప్రవేశించిన వెంకటస్వామి అసభ్య పదజాలంతో దూషించి, ఛాతిపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయ్ కూడా సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపులో తనను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని రాకేష్ ఆరోపించారు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాకేష్ పోలీసులను కోరారు.