యాంజాల్ మున్సిపాలిటీలో ఘనంగా యువ సమ్మేళనం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఆర్ఎస్ఎస్ యాంజాల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు యువ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 15 నుండి 40 సంవత్సరాల వయస్సు గల యువకులు*పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుర్క యంజాల్ బిజెపి అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి మాట్లాడుతూ "యువశక్తియే దేశశక్తి" అనే లక్ష్యంతో యువతను సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ నిర్మాణంలో, సమాజ సేవలో యువత కీలక పాత్ర పోషించాలని, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు డా.వడ్లూరి ఆంజనేయ రాజు, భాగ్యనగర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ గరుడ విజయ్ కుమార్ మరియు తదితరులు హాజరై యువతకు మార్గనిర్దేశం చేశారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, యువత బాధ్యతలపై వక్తలు వివరించారు. యువ సమ్మేళనంలో చర్చలు, ఉపన్యాసాలు, సమూహ గీతాలతో కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. కార్యక్రమం చివర్లో యంజాల్ మున్సిపాలిటీ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతకు సంఘటన నిర్వాహకులు అభినందనలు తెలిపారు