దొమ్మటి కిరణ్ కుమార్‌రావుకు జయశంకర్ జాతీయ అవార్డు
విశ్వంభర, హైదరాబాదు: తెలంగాణ ఉద్యమంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ దొమ్మటి కిరణ్ కుమార్‌రావుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జాతీయ అవార్డు ప్రదానం చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తెలిపారు. హైదరాబాదులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో దొమ్మటి కిరణ్ కుమార్‌రావును అవార్డు, శాలువాతో ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీత దొమ్మటి కిరణ్ కుమార్‌రావు మాట్లాడుతూ, తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.