బంజారా సంప్రదాయ తీజ్‌ వేడుకల్లో పాల్గొన్న పాండన్న

విశ్వంభర, హాలియా: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో బంజారా సోదరులు  తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ  వేడుకల్లో బుసిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ పాండన్న పాల్గొన్నారు.  సాంప్రదాయ నృత్యాలు, పాటలతో సందడిగా సాగాయి. పాండన్న బంజారా మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొని వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బంజారా సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించేలా ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల స్థాయి సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, బుసిరెడ్డి ఫౌండేషన్‌ సభ్యులు, బంజారా సోదరులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pandana-participated-in-banjara-traditional-teej-celebrations/article-21517

Tags: