యూపీఎస్సీ ర్యాంకర్‌కు ఎమ్మెల్యే సంజీవరెడ్డి అభినందనలు
విశ్వంభర, పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన గిరిజన యువకుడు ధరావత్ భాస్కర్ యూపీఎస్సీ పరీక్షల్లో 58వ ర్యాంక్ సాధించడంతో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు. కల్హేర్ మండల పరిధిలోని పొమ్య నాయక్ తండాకు చెందిన ధరావత్ భాస్కర్ యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 58వ ర్యాంక్ సాధించి సెంట్రల్ డీఎస్‌పీగా ఎంపిక కావడం నియోజకవర్గానికే గర్వకారణమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. భాస్కర్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదివారం ఆయన స్వగృహానికి వెళ్లి శాలువాతో సత్కరించి, పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన తండా నుంచి వచ్చిన భాస్కర్ కఠినమైన క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షల్లో 58వ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. ఆయన విజయం నియోజకవర్గ యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను సాధించగలరని భాస్కర్ నిరూపించారని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాల్డోడి తుకారాం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీర్‌శెట్టి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తండా పెద్దలు, గ్రామస్తులు, భాస్కర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు