ఆదివాసీల హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి

విశ్వంభర, ముషీరాబాద్ : ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గిరిజన సాధికారత విధానం–2010ను అమలు చేయడంతో పాటు ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాదు ట్యాంక్‌బండ్‌పై కొమురం భీం విగ్రహం వద్ద గిరిజన ఐక్యవేదిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వివేక్‌ వినాయక్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి జస్టిస్‌ నరసింహారెడ్డి, వివేక్‌ వినాయక్‌ తదితరులు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలను సమర్థంగా అమలు చేయాలని, అన్ని గిరిజన తెగలకు నిధులు, ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్లలో సమన్యాయం కల్పించాలని కోరారు. గిరిజన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం–2006, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేసి గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సోయం ప్రభాకర్‌, కోశాధికారి సోయం గోవర్దన్‌, ఉపాధ్యక్షుడు కిష్ణయ్య, కార్యదర్శి దన్సారి శ్రీరాములు, నాయకులు వెట్మా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/legal-protection-should-be-given-to-the-rights-of-tribals/article-21519

Tags: