సోమ్లా తండాలో ఘనంగా తీజ్‌ వేడుకలు

సోమ్లా తండాలో ఘనంగా తీజ్‌ వేడుకలు

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్‌ మండలం సోమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతగిరి గ్రామంలో తీజ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళినాయక్‌ సొంత గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే మురళినాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ ఉమా మురళినాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళినాయక్‌ మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గిరిజన మహిళల ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు తీజ్‌ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ ఉమా మురళినాయక్‌ మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరిజన మహిళల ఆధ్యాత్మిక విశ్వాసానికి, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తండాల్లో గిరిజన సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమ్లా తండా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/great-teej-celebrations-in-somla-tanda/article-21509

Tags: