పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

  •  సర్పంచి ప్రశాంత్

విశ్వంభర, నెల్లికుదురు: బ్లీచింగ్ పౌడర్ ను పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిల్వ ఉండే ప్రదేశాలు, అశుభ్రంగా ఉండే చోట్ల ఉపయోగించి సద్వినియోగపరచాలని సర్పంచి మాదరి ప్రశాంత్ గ్రామస్తులకు సూచించారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో గ్రామస్తులకు వర్షాకాలం పురస్కరించుకొని సర్పంచి ప్రశాంత్ ఆదివారం బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వర్షపు నీరు నిలువ ఉంచుకోకుండా చూడాలన్నారు. దోమలతోనే డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్ర శ్రీరామగిరి కోసం అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలోఉపసర్పంచ్ రామగిరి సుమన్, వార్డు సభ్యులు గొల్లపెల్లి వేణు,రామగిరి భీమలత,సంద లలిత కృష్ణ, గ్రామస్తులు జిపి సిబ్బంది పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/keep-the-surroundings-clean/article-21529

Tags: