ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది...?

  • అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి..
  • మాజీ ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి 

విశ్వంభర, హుస్నాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గత 4 రోజులుగా నిర్వహిస్తున్న సిపిఐ ప్రచార జాతా నేడు చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, ముల్కనూర్, సీతారాంపూర్  లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, ముదిమాణిక్యం, రామంచ  గ్రామాల్లో పర్యటించింది. చిగురుమామిడి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ , ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా సీపీఐ ప్రచార, పాదయాత్రలు నిర్వహిస్తోందన్నారు. మోదీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి తీసుకువస్తామన్న హామీని విస్మరించారని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పేపర్ లీకేజీలతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన గాడి తప్పిందని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, హామీ మేరకు ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. జాతాలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి,పొనగంటి కేదారి,మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జాతా కోఆర్డినేటర్ లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి,అందె చిన్నస్వామి, బోయిని వల్లభాయ్ పటేల్ ,కాంతాల శ్రీనివాస్ రెడ్డి,తేరాల సత్యనారాయణ,ముద్రకోల రాజయ్య,మావురపు రాజు,మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ,కొట్టె అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బామండ్ల పెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/what-happened-to-the-guarantee-of-two-crore-jobs-per/article-21531

Tags: