అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
- నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
విశ్వంభర, నారాయణఖేడ్: నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మానూర్ మండలంలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ్‌పేట్, మంగల్‌పేట్, ఆరెల్లి తల్లి ఆలయం, ముత్యాల పోచమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, సర్పంచ్ బీరప్ప కురుమ, ఆలయ చైర్మన్ మల్లప్ప, ఆలయ అధికారి శివరుద్రప్ప, అఖిలేష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్‌సేఠ్, కౌన్సిలర్ మారుతి కురుమ, బీరప్ప, శివరుద్రప్ప, రుక్మిణి, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, అంజాగౌడ్, మాణిక్యం, సుదర్శన్‌రెడ్డి, సాయిసేఠ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.