ఆదివాసి హక్కుల కోసం ఉద్యమిద్దాం

ఆదివాసి హక్కుల కోసం ఉద్యమిద్దాం

  • ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం పిలుపు 

   విశ్వంభర, మహబూబాబాద్ :  ఆదివాసి హక్కులకై కొమురం భీమ్ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం  (ఏఐటిఎఫ్)   కమిటీ సభ్యులు హలావత్ లింగన్న పిలుపునిచ్చారు .  ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కురవి మండలం చౌళ్ళ తండ గ్రామంలో ఆదివాసి ఫోరం ఆధ్వర్యంలో ప్రదర్శన భారీగా నిర్వహించారు . అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఉద్దేశించి లింగన్న మాట్లాడుతూ నాడు జల్ జంగల్ జమీన్ హమారా , నినాదంతో పోరాటాలు కొనసాగించి ఆదివాసీలు ఐదవ షెడ్యూల్ 1/70 చట్టం పిసా చట్టం 2006 అటవి హక్కుల చట్టం లాంటి చట్టాలను సాధించుకోవడం జరిగింది  అని గుర్తు చేశారు . వాటిని  నేడు మోడీ ప్రభుత్వం  తుంగలో తొక్కి అటవీ హక్కుల సంరక్షణ నియమాలు 2022 పేరుతో చట్టాన్ని తీసుకువచ్చి అడవి, అటవీ సంపద పై ఆదివాసులకు ఎలాంటి హక్కులు లేకుండా కార్పొరేట్ శక్తులకు అడవిని అడవిలో ఉన్న సంపదను దోచి పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నాడు ఏజెన్సీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న పీసా కమిటీలు, గ్రామ సభలు  , తీర్మానo రాష్ట్రపతి ఆమోదo తో అభివృద్ధి పనులు చేపట్టేవారు కానీ ,  నేడు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వాటిని తుంగలో తొక్కి నేరుగా కేంద్ర ,  ప్రభుత్వమే అనుమతులిస్తూ కార్పొరేట్ శక్తులు ఖనిజ సంపదను దోచుకుపోవడానికి  పర్మిషన్లు ఇస్తూ అడవిపై అడవి సంపదపై ఆదివాసులకు ఎలాంటి హక్కులు లేకుండా ధ్వంసం చేస్తున్నారని, ప్రశ్నిస్తే నక్సలైట్ గా ఎదురు తిరిగితే ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు  . నాటి పోరాట స్ఫూర్తితో ఆదివాసుల  హక్కులను కాపాడుకుందామని ,  అడవిని దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులను తరిమి కొడదామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు సామ పాపయ్య  , ఆదివాసి ఫోరం నాయకులు ఈసం ప్రవీణ్ ,  చట్ల నారాయణ  , చట్ల రామకృష్ణ  ,చట్ల సాయి  , ఈసం వెంకన్న  , ఈసం రమేష్  ,ఈసం అజిత్ , వట్టం సాయి , వట్టం నాగేష్  , తదితరులు పాల్గొన్నారు

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-move-for-tribal-rights/article-21523

Tags: