కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ‘ఇంద్రపుత్ర’గా పాన్ ఇండియా మూవీ

  • కిరణ్ అబ్బవరం ‘ఇంద్రపుత్ర’.. ధర్మం, అధర్మం మధ్య మహా సంగ్రామం

Kiran Abbavaram: టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఇంద్రపుత్ర’ పేరుతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ పుప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మం, అధర్మం మధ్య జరిగే శాశ్వత పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇంద్రపుత్ర కథతో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. శక్తివంతమైన పాత్రలు, భారీ విజువల్స్, ఆసక్తికరమైన కథనం, పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో మెరుపులు, భారీ ఆయుధం, యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Read More ఇలాంటి పోజులు అవసరమా?.. జ్యోతిక ఫోటోషూట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్‌

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేరణ అరోరా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కీర్తన్ వత్తం కథను అందిస్తున్నారు. తాన్విన్ దత్తా సహకారంతో కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ఇంద్రపుత్ర’ తొలి అధ్యాయంగా ఈ కొత్త పాన్ ఇండియా సినిమాటిక్ యూనివర్స్ ఎలా విస్తరించబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/movies/kiran-abbavarams-new-movie-indraputra-is-a-pan-india-movie/article-21469

Tags: