ప్రముఖ సాహితీవేత్త చౌడూరి నరసింహారావుకు ఆత్మీయ సత్కారం

విశ్వంభర, హైదరాబాద్: భవానీ సాహిత్య వేదిక (కరీంనగర్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ ఆవరణలోని కళా సంగీత నాట్య వేదికపై కవితారామం, వైద్యో నారాయణో హరిః పుస్తకాల ఆవిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, సంస్కృతాంధ్ర పండితుడు చౌడూరి నరసింహారావును అతిథులు ఘనంగా సత్కరించారు. శతాధిక గ్రంథాల ప్రచురణకర్త, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గనులు, భూగర్భ శాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి. రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వం వహించిన ‘కవితారామం’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ‘సాహితీ కిరణం’ సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు ‘వైద్యో నారాయణో హరిః’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘కవితారామం’పై చౌడూరి నరసింహారావు సమీక్షా ప్రసంగం చేశారు. ‘కవితారామం’లోని ‘ఆరామం’ అంటే అందమైన పూలతోట అని వివరిస్తూ, పేరుకు తగినట్లుగానే ఈ సంకలనంలో 96 మంది కవులు వివిధ అంశాలపై విభిన్న కవితా ప్రక్రియల్లో తమ భావాలను అందంగా వ్యక్తీకరించారని అన్నారు. ఇంతటి బృహత్తర కృషి చేసిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ భావి రచయితలకు మార్గదర్శకులని ప్రశంసించారు. సంకలనంలోని పలు కవితలను ఉదహరిస్తూ కవులను అభినందించారు. ‘వైద్యో నారాయణో హరిః’ గ్రంథంపై ప్రముఖ జర్నలిస్టు, కవి, రచయిత మోటూరి నారాయణరావు సమీక్షా ప్రసంగం చేశారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ‘సుస్థిర పుడమి’ సంపాదకుడు ఖండేరావు రమేష్‌రావు మాట్లాడుతూ కవులు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే రచనలు విరివిగా చేయాలని సూచించారు. ప్రముఖ కవి లోడే రాములు సభకు ఆహ్వానం పలికారు. కార్యక్రమానికి ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 30 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు వివిధ సామాజిక, సాహిత్య, సమకాలీన అంశాలపై తమ కవితలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు అతిథులను సత్కరించగా, కార్యక్రమంలో పాల్గొన్న కవులందరినీ అతిథులు సర్టిఫికెట్లు, శాలువాలతో ఘనంగా సత్కరించారు

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-warm-tribute-to-noted-literary-figure-chowdhury-narasimha-rao/article-21479

Tags: