విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట లోని విఠలేశ్వర దేవాలయంలో ఆషాడ ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీ గణపతి నవగ్రహ రుక్మిణి పాండురంగ మూల మంత్ర హవనము. హోమము ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్షల విరమణ చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 11:10 నిమిషాలకు శ్రీ రుక్మిణి వితలేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ బాధ్యులు కోరుచున్నారు