ఘనంగా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం
విశ్వంభర, పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ 1994 డిసెంబర్ 23న 160 దేశాలు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో 40 కోట్ల మంది ఆదివాసీ గిరిజనులు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గిరిజనుల పోరాటం మరువలేనిదని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు అందించడంతో పాటు ‘మా తండాలో మా రాజ్యం’ నినాదంతో గిరిజనులు చేసిన ఉద్యమాన్ని గుర్తించి ప్రతి తండాను గ్రామపంచాయతీగా మార్చారని చెప్పారు. రహదారులు లేని తండాలకు రోడ్లు నిర్మించడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండా, గూడెంకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో పాటు ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణలక్ష్మి పథకం అమలు చేశామని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, తండాల్లో భోగ్ బండార్ కార్యక్రమాల నిర్వహణకు నిధులు కేటాయించామని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్, కొమురం భీమ్ భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గిరిజన తండాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తి చేయాలని భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ద్వారా తండాలకు సక్రమంగా తాగునీరు అందడం లేదని, సమస్యను పరిష్కరించి గిరిజనులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు నాయక్, బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు నగేష్ సేట్, ముజామిల్ ఎస్కీ, సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ రాజు, నార్యానాయక్, వెంకట్ నాయక్, బాబుసింగ్, సురేష్ నార్యానాయక్, రవీందర్, దశరథ్, శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.