శ్రావణ్ కుమార్ పార్థివదేహానికి స్నేహితుల నివాళి
విశ్వంభర, ఇనుగుర్తి: పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావా మిత్రమా అంటూ అనారోగ్యంతో కన్నుమూసిన స్నేహితుడు పోలోజు శ్రావణ్ కుమార్(29) భౌతిక కాయానికి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ భాష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యవాస్తు పండితులు పోలోజు పూర్ణ చారి స్వర్గీయ రాజమ్మ దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. తల్లిదండ్రులు పూర్ణ చారి సరిత, సోదరుడు చందు తో పాటు కుటుంబ సభ్యులు, క్లాస్ మెంట్స్,స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రావణ్ కుమార్ తో కలిసి ఆడుకున్న, చదువుకున్న రోజులను,నిరంతరం మాట్లాడుకున్న మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్వర్గీయ శ్రావణ్ కుమార్ మహాప్రస్థాన యాత్రలో వివిధ పార్టీల నాయకులు,బంధువులు, గ్రామస్తులతో కలిసి స్నేహితులు గుడాల రాజు,బత్తెం విజయ్,వీరగోని అశోక్,నాయిని నరేష్,మాద గాని ఉమేష్,బైరు సంతోష్,కొండపర్తి సంతోష్,వడపల్లి సందీప్,ఉడుత సురేష్, బైరు వినయ్,పోలోజు నరేష్ మాదగాని సంతోష్ బైరు మురళి,మునిగంటి రమేష్,వంశీ,క్రాంతి, ఉడుత సతీష్,కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.