ఆదాయం వచ్చే పంటల నే ఎంచుకోండి
విశ్వంభర, హైదరాబాదు : వర్షపాతంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆదాయం వచ్చే పంటలకు అనుకూలమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె. దశరథ్ సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంపై వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. ఆదివారం హైదరాబాదులో పలు అమ్మవారి ఆలయాలను సందర్శించిన అనంతరం దశరథ్ మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అయితే రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు అధైర్యపడవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వాలు ముందుండాలని దశరథ్ కోరారు.