బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సి.ఎన్ రెడ్డి

డ్డివిశ్వంభర, హైదరాబాద్: రహ్మత్‌నగర్, కార్మిక్‌నగర్ డివిజన్‌లలో బోనాల పండుగ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి . పండుగను పురస్కరించుకుని ఆయా డివిజన్‌లలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజలందరూ వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-corporator-cn-reddy-participated-in-the-bonala-festival/article-21484

Tags: