జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

  • సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరికుంట్ల నాగన్న

విశ్వంభర, మహబూబాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరికుంట్ల నాగన్న పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులు, స్ట్రీట్‌ వెండర్లు, ఆటో కార్మికుల అడ్డాల వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తూ జైలు భరో కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చారని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు వ్యతిరేకంగా గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని కోరారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున ఐక్యమై జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగన్న కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శంకర్‌, కోటేశ్వరరావు, ఎర్ర శ్రీను, పులిగుజ్జ వెంకన్న, పాలాభిందెల మల్లయ్య, తోట శ్రీను, ఆనంద్‌, రాజు, రాములు, శ్రీరాములు, వీరన్న, యాకయ్య, రాము, సర్వన్‌, సమ్మయ్య, యాకుబ్‌, యూసుఫ్‌, వెంకటేష్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/make-jail-bharo-program-a-success/article-21490

Tags: